టీఆర్ఎస్ పార్టీ , సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే అంటూ… టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నాడని.. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని… 1569 మందిని గుర్తించి ఉద్యోగ అవకాశాలు, డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరులను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానపరుస్తోందని ఆయన విమర్శించారు. 2018 ఎన్నికల సందర్భంగా ఉద్యోగ అవకాశాలైనా.. రూ.3016 నిరుద్యోగ భ్రుతి ఇస్తామనన్నారు. దాన్ని కూడా బడ్జెట్ లో మరిచారన్నారు. నిరుద్యోగులను చివరి బడ్జెట్ లో కూడా కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. ఇళ్లు లేని నిరుపేదలకు ఈ బడ్జెట్ లో మోసం చేశారని అన్నారు. శాసన సభా నిర్వహణలో గవర్నర్ ప్రసంగాన్ని ఎత్తేశారని విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున సభ్యులపై చర్యలు తీసుకున్న ఘటన లేదని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశంలో సరైన ప్రాధాన్యతలు తక్కకపోతే నిరసన తెలపడం సభ్యుల హక్కని.. ఆయన అన్నారు. ఎప్పుడూ కూడా.. ప్రజాస్వామ్య వ్యతిరేఖ విధానాలను ఎప్పుడూ చేపట్టలేదని.. కానీ స్పీకర్ వైఖరి సరిగ్గా లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ఇదే…. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-