జంపింగులు…రాజకీయ నేతలు అవసరాలకు తగ్గట్టుగా పార్టీలు మారిపోతూ ఉంటారు..ఈ జంపింగ్ రాజకీయం ఏపీలో చాలా ఎక్కువగానే ఉంటుంది. అధికారం మారిన ప్రతిసారి ఈ జంపింగులు జరుగుతూనే ఉంటాయి. టీడీపీ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు జంప్ చేశారు. మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు ఈ జంపింగ్ కార్యక్రమం జరిగింది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో జంపింగులు బాగా జరిగాయని, తర్వాత తర్వాత జంపింగులు ఆగిపోయాయి. గత ఏడాది నుంచి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారు లేరు. మరి వైసీపీలో నాయకులు ఫుల్ గా ఉండటం వల్ల వలసలు జరగలేదా? లేక వైసీపీలోకి వెళ్ళిన ఉపయోగం లేదని టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే గత ఏడాది నుంచి నేతల జంపింగులు జరగలేదు. కానీ ఇటీవల టీడీపీలోకి వలసలు నడుస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీలో చేరుతున్నారు.
ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారని కొందరు టీడీపీ సీనియర్లు మాట్లాడుతున్నారు. తమకు వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. అసలు నిజంగా ఆ పరిస్తితి ఉందా? లేక రాజకీయంగా వైసీపీని ఇరుకున పెట్టడానికి అలా చెబుతున్నారా? అంటే వైసీపీని ఇరుకున పెట్టడానికే అని చెప్పాలి…ఎందుకంటే అధికారాన్ని వదిలేసుకుని ఎవరూ కూడా ప్రతిపక్ష పార్టీలో చేరరు.
అయితే వైసీపీ సైతం..తమకు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతుంది..ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చారు. ఆ నలుగురు తర్వాత మరొక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు రాలేదు..కానీ తాజాగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి…కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారిని తీసుకుంటామని అంటున్నారు. అంటే పార్టీ మారడానికి కొందరు రెడీగా ఉన్నారని అర్ధమవుతుంది. మరి చూడాలి ఇంకెంత మండి ఎమ్మెల్యేలు సైకిల్ దిగుతారో?