ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి revanth reddy ఎపిసోడ్ నడుస్తోంది. ఆయన్ను ఇలా టీపీసీసీ ప్రెసిడెంట్‌గా చేశారో లేదో అప్పుడే ఆయన యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. వరుసగా సీనియర్లను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఆయన మరికొందరిని పక్కన కూడా పెడుతున్నారు. ఇక ఇప్పుడు ఆయన భట్టి విక్రమార్కను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
కాగా ఈరోజు ఆయన ఖమ్మం కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ భేటీలో భట్టి విక్రమార్క లేరు. కేంద్ర మాజీ మంత్రి అయిన రేణుకా చౌదరి ఏర్పాటు చేసిన ఈ భేటీలో రాంరెడ్డి, దామోదర్ రెడ్డితో పాటు చంద్రశేఖర్ లాంటి కీలక నేతలు మాత్రమే హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న భట్టిని మాత్రం పక్కన పెట్టడంతో కాంగ్రెస్‌లో దుమారం రేగుతోంది.
అయితే భట్టి విక్రమార్క అంటే రేణుకా చౌదరికి అస్సలు పడదని, ఆయనకు చెక్ పెట్టేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భట్టి మార్కు లేకుండా చూసేందుకు రేవంత్ సపోర్టుతో పావులు కదుపుతున్నారు రేణుకా చౌదరి. ఇక రేవంత్ కూడా ఆయనకు చెక్ పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. తనకు టీపీసీసీ రాకుండా అడ్డుకునేందుకు భట్టి ప్రయత్నించాడనే కోపంతోనే రేవంత్ ఆయన్ను పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది.