హుజూరాబాద్ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇక్కడ ఎలాగైనా గెలిచి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలపరిచేందుకు పక్కా ప్లాన్ వేస్తోంది. బలమైన నేత అయిన ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేయడం కలిసొచ్చే అంశమే అయినా.. టీఆర్ ఎస్ ఎత్తులను చిత్తు చేయడానికి అన్ని విధాలుగా పోరాడుతోంది. ఇందుకోసం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేతలు ఇప్పటికే హుజూరాబాద్‌లో మండలానికో ఇన్ చార్జిని పెట్టి రాజకీయాలను చేస్తోంది.
అయినా సరే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే మరింత బలం కావాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ఏకంగా ఆర్ ఎస్ఎస్ పరివారాన్ని రంగంలోకి దించారు కమలనాథులు. ఏ ఎన్నికలయినా బీజేపీకి కొండంత బలంగా ఉండేది ఆర్ ఎస్ ఎస్ పరివారమే. వారు చేసే ప్రచరామే బీజేపీని గట్టెక్కించడంలో ముందుంటుంది.
ఇప్పుడు కూడా ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే సంఘ్ సైన్యం తమ పనిని ప్రారంభించింది. నియోజకవర్గంలోని అన్ని ఐదు మండలాలను చుట్టేసేందుకు రెడీ అవుతోంది. అన్ని మండలాలను యూనిట్లుగా విభజించుకుని మరీ అక్కడి పరిస్థితులను అంచనా వేస్తూ ప్రచారానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మరి ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగితే టీఆర్ ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే చెప్పాలి.