సైదాబాద్ నిందితులను ఎన్ కౌంటర్ చేయాలి: మంత్రి మాల్లారెడ్డి

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల గిరిజన బాలిక బలైపోయిన సంగతి తెలిసిందే. సినిమా హీరోకు జరిగిన ప్రమాదాన్ని టీఆర్పీ రూపం లో క్యాష్ చేసుకునే పని లో మీడియా బిజీ అయిపోవడం తో.. బయట ప్రపంచానికి ఈ దారుణ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మాములు ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ దాడికి పాల్పడిన వారి పై తీవ్ర స్థాయి లో మండి పడుతున్నారు.

trs minister malla reddy tongue slip

అలాంటి నీతమైన వ్యక్తులను నరికి చంపినా.. పాపం లేదని మండి పడుతున్నారు. అటు తెలంగాణ అన్ని ప్రతి పక్ష పార్టీలు కూడా.. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నాఆయి. అయితే.. ఈ నేపథ్యం లో తాజాగా తెలంగాణ మంత్రి మాల్లారెడ్డి.. ఈ ఘటనపై స్పందించారు. సైదాబాద్ సింగరేణిలో బాలిక పై అత్యాచారం చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి అన్నారు. బాధిత కుటుంబాన్ని త్వరలోనే పరమర్షిస్థానాన్ని తెలిపారు.