వైసీపీ ఆవిర్భావ వేళ సంబంధిత వర్గాలు అంతా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలలో వేడుకలు జరుగుతున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ అధినేత్రిని జగన్ ఎదిరించిన సాహసం, ఓదార్పు యాత్రను కొనసాగించిన వైనం ఇవన్నీ స్మరణకు తూగుతున్నాయి. మళ్లీ సూరీడు పుడతాడు చూడు అన్న పాట కూడా మళ్లీ మళ్లీ వినపడుతోంది.. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ వినపడిన పాట కూడా మళ్లీ మళ్లీ వినపడుతోంది.
ఇంతటి నేపథ్యం ఉన్న పాట ఇంతటి నేపథ్యం ఉన్న పార్టీ ఇవాళ పుష్కర కాలం పూర్తి చేసుకోవడం ఓ విశేషం. ఆ రోజు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణా రెడ్డి తరువాత కాలంలో వైసీపీ తెలంగాణ ఎఫైర్స్ చూస్తూ.. పార్టీలో కీలకం అయ్యారు. అటుపై పార్టీ ఎన్నో విజయాలు అందుకుంది. వాటన్నింటిలోనూ సజ్జల కీలకంగానే ఉన్నారు.
నెగ్గుకు వచ్చారుజ. ఆరోగ్యం సహకరించని రోజుల్లోనూ పని చేశారు. కొందరు తన మాట వినకపోయినా వారిని కూడా ఏమీ నొప్పించకుండా తన పని తాను చేసుకుని పోయారు.
ఓ విధంగా అంతా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జపం చేస్తారు కానీ చాలా విషయాల్లో పార్టీకి ఏ కీడూ రానివ్వక కాపాడింది కాస్తో కూస్తో కాదు అందరి కన్నా మిన్నగా భాషను హుందాగా ఉపయోగించేది సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రమే అన్నది ఓ వాస్తవం.ఇదే అంగీకరించక తప్పని నిజం. భాషపై మంచి పట్టు బాగా రాసేవారిపై ప్రేమ ఇవాళ్టికీ ఆయన లో ఉంది. అందుకే జగన్ ఆయనకు అంతటి ప్రాధాన్యం ఇస్తారు. ఏంటంటి పార్టీలో మీరే నంబర్ 2 అంట కదా! అని మీడియా ఓ పిచ్చి ప్రశ్న ఆయన దగ్గర వేసింది.. నవ్వి ఒక్కటే చెప్పాడు. డు కాదు రు. పార్టీలో ఒకటి నుంచి వంద స్థానాల వరకూ అన్నీ జగన్ అంతా జగన్ అని తేల్చేశారు. మరి! మీరు మంత్రి అవుతారా పోనీ ఎంపీ గా రాజ్యసభకు పోవొచ్చు కదా అంటే మళ్లీ నవ్వేడు.. డు కాదు రు..
నవ్వేరు.
ఇవాళ ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరించిన ట్రబుల్ షూటర్.. ఉద్యోగులు మొన్నటి వేళ తనని తిట్టినా కూడా నవ్వే ఊరుకున్నారు. అంతేకానీ తీవ్ర పరుష పదజాలంతో మీడియా మైకుల ముందు అసహనం ప్రదర్శించిన దాఖలాలే లేవు.. ఎవరిని మీరు తిడుతున్నారో మీకు ఏమయినా సోయి ఉందా అని మాత్రమే అన్నారు.మీరు టీచర్లు కదా మంచి భాష వాడాలి అని కూడా చెప్పిపంపారు. ఆ హుందాతనం కారణంగానే సజ్జల ఇవాళ ఎందరికో ఆప్తుడు డు కాదు లు ఆప్తులు.