యూపీ రాజకీయం: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో అఖిలేష్ యాదవ్..!

-

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఘన విజయం సొంతం చేసుకుంది. రికార్డ్ క్రియేట్ చేస్తూ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి యూపీలో అధికారం చేపట్టనుంది. మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ కూటమి 273 సీట్లను కైవసం చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ కేవలం 125 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. తాము అధికారంలోకి వస్తామనుకున్న సమాజ్ వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ లకు ఎదురుదెబ్బ తగిలింది. 

ఇదిలా ఉంటే అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్హాల్ నుంచి పోటీ చేసిన అఖిలేష్ 67 వేల పైగా మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఎస్పి బఘేల్ ఓడించారు. మరోవైపు ఎస్పీ కీలక నేత ఆజాంఖాన్ రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నేత ఆకాష్ సక్సేనాపై 55,000 ఓట్ల తేడాతో ఓడించాడు. అయితే వీరిద్దరు తమ ఎమ్మెల్యేలకు రాజీనామ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఇప్పటికే లోక్ సభ సభ్యులుగా ఉంటూ.. అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం అఖిలేష్ ఆజాంఘడ్ నుంచి, ఆజాంఖాన్ రామ్ పూర్ లోక్ సభ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వీరిద్దరు కూడా లోక్ సభ ఎంపీలుగా కొనసాగేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గెలిచిన అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news