సత్తుపల్లిలో సండ్ర గెలుపు కొనసాగేనా? టీడీపీ ఓట్లపై గురి.!

-

ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే, ఈసారి బిఆర్ఎస్ ను ఇంటికి పంపాలని కాంగ్రెస్, బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంటే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య చావో రేవో అన్నట్లు పోటీ నడుస్తోంది. కొన్ని జిల్లాల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటువంటి జిల్లాలలో ముఖ్యమైనది ఖమ్మం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తామని కంకణం కట్టుకున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పట్టు కోసం నేతలందరినీ కూడగడుతున్నారు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం లో బిఆర్ఎస్ తరఫున సండ్ర వెంకట వీరయ్య పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి మట్టా దయానంద  భార్య రాగమయి ని బరిలోకి దించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ సండ్ర వీరయ్య ప్రజల వద్దకు వెళుతుంటే, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు పదేళ్లుగా బిఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదంటూ, ఈసారి మార్పు కావాలని కెసిఆర్ నియంత్రత్వ పాలనకు స్వస్తి పలకాలి అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వెళుతున్నారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని చెప్పవచ్చు.  ఇక ఇక్కడ టీడీపీ కీలకం గా మారింది. గత మూడు ఎన్నికల్లో వీరయ్య టీడీపీ నుంచే గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అయితే ఇప్పుడు టీడీపీ పోటీ చేయట్లేదు కానీ టీడీపీ అభిమానులు మద్దతు పొందేందుకు అభ్యర్థులు టీడీపీ జెండాలు కూడా పట్టుకుని ప్రచారం లో దిగారు. మరి చివరికి ఇక్కడ ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news