రాజకీయాల్లో తన-మన సంగతులు ఎప్పుడో కాలం చెల్లిపోయాయి. తమకు న్యాయం జరిగిందా? లేదా? అని చూసుకునే నాయకులే ఇప్పుడు మిగిలారు.. ఈ క్రమంలోనే.. చాలా మంది నాయకులు.. పార్టీకి ఇబ్బంది వస్తుందని తెలిసి కూడా పరుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలిసి తెలిసి.. పార్టీని నడిరోడ్డుపై నిలబెడుతున్నారు. నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలను కూడా నడిరోడ్డుపై మాట్లాడేస్తున్నారు. పలితంగా అటు వారు చిక్కుల్లో పడుతూనే.. పార్టీని.. పార్టీ అదినేతను కూడా చిక్కుల్లోకి నెట్టేస్తున్నారు. మరోవైపు.. ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించేస్తున్నారు. ఇలాంటి పరిణామమే.. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అది కూడా రాజకీయ దిగ్గజం.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కారణంగా.. వైసీపీ చిక్కుల్లో పడింది.
విషయంలోకి వెళ్తే.. జిల్లాల విభజన, పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటును జగన్ భుజానికెత్తుకుంది. ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించింది. అయితే.. దీనిని అన్యాపగా ప్రస్థావించిన ధర్మాన ప్రసాదరావు.. తన సొంత జిల్లాను విభజిస్తే.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న జిల్లా, ఆర్థికంగా.. విద్యాపరంగా కూడా వెనుకబడిన జిల్లా మరింతగా వెనుకబడి పోతుందంటూ.. కొన్నాళ్ల కిందట.. బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు.. ఇప్పటికీ.. వైసీపీకి ఇబ్బందిగానే పరిణమించాయి. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా విబజనవిషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.
మీ నాయకుడు ప్రసాదరావే.. చెప్పారంటూ.. జిల్లాను విభజించరాదని ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఇటీవల ఓ పర్యటనను సైతం మంత్రి రద్దు చేసుకున్నారు. వాస్తవానికి జిల్లా విభజన.. అంటే.. విజయనగరం.. పార్లమెంటు పరిధిలోకి.. వచ్చే శ్రీకాకుళంలోని కొన్ని నియోజకవర్గాలు .. విజయనగరం జిల్లాగా ఉంటాయి. దీంతో ఆయా పరిధిలోని ప్రధాన పరిశ్రమలు.. మాత్రం పోతాయి. ఈ క్రమంలోనే శ్రీకాకుళానికి అన్యాయం జరుగుతుందనేది భావన. అయితే.. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లా ఉనికిని కాపాడతామంటూ.. ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ, ఇప్పుడు ప్రజలు వినిపించుకోవడం లేదు. ధర్మానకు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో.. ఆయన చెప్పిన దానినే ప్రజలు విశ్విస్తున్నారు.
ఇక, టీడీపీ కూడా జిల్లా విబజనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపత్యంలోనే ధర్మాన చెప్పిన దాన్నే.. ఇటీవల కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు ఉటంకించారు. జిల్లా విభజనతో ఎంతో నష్టపోతుందని.. మీ నాయకులే చెబుతున్నప్పుడు.. ఎలా విభజిస్తారనేది వీరి మాట. ఏదేమైనా.. గతంలో ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల సెగ ఇప్పుడు రానురాను పెరుగుతుండడం గమనార్హం. తనకు మంత్రి పదవి దక్కలేదనో.. పార్టీలో ప్రాధాన్యం లేదనో.. తన సీనియార్టీని పట్టించుకునే నాథుడు కనిపించడం లేదనో ప్రసాదరావు చేసిన ఆక్రోశపూరితమైన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి.