రాహుల్ గాంధీ కి రేవంత్ రెడ్డి మీద భారీ – సెన్సేషనల్ కంప్లైంట్ ..!

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనపై రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జీవో నెంబర్ 111 విషయం లో రేవంత్ రెడ్డి చాలా అతిగా ప్రవర్తిస్తున్నారని ఓవరాక్షన్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. నా రాజకీయ జీవితం పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని…సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి అనుచరులు చేస్తున్నా ప్రచారాన్ని ఖండించారు.Image result for rahul gandhi revanth reddyకాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా రాష్ట్రంలో లో ఈ సమస్య ఉంటే కలిసి కట్టుగా పోరాడే వాళ్లు అని…కానీ రేవంత్ రెడ్డి ఏదో పెద్ద పుడింగి లాగా  తీస్మార్ ఖాన్ అన్నట్టుగా వ్యవహరించారని జగ్గారెడ్డి విమర్శలు చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి లో విషయం ఉంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎందుకు విజయం సాధించలేదని ప్రశ్నించారు.

 

ఇటువంటి తరుణంలో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మీద భారీ సెన్సేషన్ కంప్లైంట్ రాహుల్ గాంధీకి ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే…తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి అనుచరులు…పార్టీని ఖాళీ చేయించే విధంగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారని దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారంటూ జగ్గారెడ్డి కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ అయింది. 

Read more RELATED
Recommended to you

Latest news