ఐటీ-ఈడీలతో ‘కారు’ షేక్..నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

-

తెలంగాణలో ఐటీ, ఈడీ రైడ్స్ టీఆర్ఎస్ పార్టీ నేతలని టెన్షన్ పెడుతున్నాయి. బడా వ్యాపారాలు చేస్తున్న నేతల టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాలపై ఈడీ విచారణ సాగుతుంది. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆఫీసుల్లో, కాలేజీలో ఐటీ దాడులు కొనసాగాయి. మల్లారెడ్డి తనయుడు, అల్లుడు ఇళ్ళు, ఆఫీసులు కూడా వదలలేదు. అలాగే ఈ దాడుల్లో మల్లారెడ్డి బంధువల ఇళ్ళలో కొంత నగదుని కూడా ఐటీ సీజ్ చేసింది. రెండు రోజుల పాటు ఐటీ దాడులు నడిచాయి.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఒకానొక దశలో మల్లారెడ్డి, ఐటీ అధికారుల మధ్య వాదోపవాదాలు కూడా నడిచాయి. అలాగే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. అటు మల్లారెడ్డి మనవరాలుని బలవంతంగా బ్యాంక్ లాకర్లు తీయించడానికి తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే మల్లారెడ్డి మెడికల్ సీట్లలో స్కామ్ చేశారని కథనాలు వచ్చాయి. ఇలా ఐటీ రైడ్స్ నడవడంతో టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది..ఎవరు భయపడవద్దని కేసీఆర్ చెప్పిన సరే..నేతలు టెన్షన్ పడుతూనే ఉన్నారని తెలిసింది.

ముఖ్యంగా టీఆర్ఎస్ నేతల ఆర్ధిక మూలాలని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈ రైడ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.  వేల కోట్ల వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు? సీఎం కేసీఆర్ ఆర్ధిక మూలాలు ఎక్కడ ఉన్నాయి? వంటి అన్ని సమాచారాలను సేకరించిన ఈడీ, ఐటి, సిబిఐ దర్యాప్తు బృందాలు వారిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి.

ఇప్పటికే మల్లారెడ్డిని టార్గెట్ చేశారు..ఆ తర్వాత కొందరు బడా నేతలపై ఫోకస్ పెట్టారని సమాచారం. టీఆర్ఎస్ నేతలు అక్రమంగా సంపాదించారని చెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసి దాడులు చేయించే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉన్నవారు, చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం, గ్రానైట్ వ్యవహారం, ఆదాయపు పన్ను శాఖకు పన్నులు సరిగా చెల్లించని వారినే టార్గెట్ చేయనున్నారు. అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి..ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఆశన్నగారి జీవన్ రెడ్డిలని టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులు కొనసాగవచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news