సినీ రంగం అంటేనే రంగులు ప్రపంచం. అయితే ఇందులో అవకాశానందిపుచ్చుకోవాలంటే ఎంత కష్టమో.. ఆ తర్వాత నిలబడాలి అంటే కూడా అంతే కష్టం అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి..
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు కమెడియన్ ప్రియదర్శి.. ఇండస్ట్రీలో నిలబడాలి అంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలియాలని అన్నాడు.. కొన్ని విషయాలు మొహమాట పడి ముందుకు వెళితే ఇంక అంతే సంగతులు అని తెలిపాడు.. నటుడుగా మంచి పేరు సంపాదించుకున్న ప్రియదర్శి తెలంగాణ యాస పంచుల ప్రాశలతో మంచి ఫేమస్ అయ్యాడు… చిన్న చిన్న పాత్రలలో మెరిపిస్తూ.. స్టార్ కమెడియన్ స్థాయికి వచ్చిన ప్రియదర్శి.. పెళ్లి చూపులు సినిమాతో పరిచయం అయ్యి… మల్లేశం, జాతిరత్నాలు లాంటి సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు..
రీసెంట్ గా రాహుల్ రామకృష్ణతో కలిసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో సందడి చేశారు ప్రియదర్శి. ఈ సందర్భంగా “ఇంతవరకూ కూడా నాకు తగిన పాత్రలనే చేస్తూ వచ్చాను. నాకు నచ్చకపోతే సున్నితంగానే ‘నో’ చెప్పేస్తాను. అయితే ‘నో’ చెప్పడం కూడా పెద్ద కళనే. ఎందుకంటే తలపొగరు అనేసి ప్రచారం చేస్తారు. ఈయన పెద్ద ఆర్టిస్టు .. ఈయనకి నచ్చాలట .. నిన్నగాక మొన్నొచ్చాడు..అందువలన ఇక్కడ నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేదంటే చాలా జరిగిపోతాయి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే, మా మేనేజర్ రంగంలోకి దిగిపోయి, ఇప్పుడు కాదు లెండి .. మరోసారి చూద్దాం ” అంటూ ఏదో మేనేజ్ చేసేస్తాడు. నటుడిగా కొంత గుర్తింపు వచ్చిన తరువాత కాస్త కోపాన్ని తగ్గించుకుని మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.