కాంగ్రెస్ నుంచి షర్మిల..పాలేరుతో పాటు మరో సీటు?

-

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ అంటూ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్న షర్మిల ఈ మధ్య ట్విట్టర్ లో తప్ప..బయట రాజకీయాలు చేయడం లేదు. ఇక ట్విట్టర్  వేదికగానే కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతుంది. ఇదే సమయంలో ఆమె..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు..కానీ జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే..షర్మిల కాంగ్రెస్ వైపే వెళ్తారని అంటున్నారు.

ఇటీవల వైఎస్సార్ ఆత్మగా చెప్పబడే కాంగ్రెస్ సీనియర్ కే‌వి‌పి రామచంద్రారావు..మాట్లాడుతూ..షర్మిల పార్టీ విలీనంపై చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అని, ఆశాజనక ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ థాక్రే మాత్రం..ఇది ఏ‌ఐ‌సి‌సి వ్యవహారమని చెప్పుకొచ్చారు. మొత్తం మీద షర్మిల పార్టీ విలీనం అంశం ముందుకెళుతుందని తెలుస్తుంది. అయితే గత ఎన్నికల్లోనే చంద్రబాబు వల్ల ఆంధ్రా పెత్తనం అని కే‌సి‌ఆర్ టార్గెట్ చేసి కాంగ్రెస్ ని దెబ్బతీశారు. ఇప్పుడు షర్మిల వల్ల కూడా అదే జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

అటు ఏపీ కాంగ్రెస్ నేతలు ఏమో..షర్మిల ఏపీకి రావాలని కోరుతున్నారు. కానీ షర్మిల తెలంగాణపైనే ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ వైపు ఆమె ముందుకెళుతున్నారని సమాచారం..అలాగే పాలేరు కాంగ్రెస్ సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె కోసమే అది రిజర్వ్ చేశారని అంటున్నారు. అదే సమయంలో షర్మిల పాలేరు కాకపోతే సికింద్రాబాద్ సీటులో పోటీ చేయవచ్చని అంటున్నారు.

సికింద్రాబాద్ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు..ఒకవేళ షర్మిల బరిలో ఉంటే టఫ్ ఫైట్ ఉంటుంది. చూడాలి మరి షర్మిల చివరికి కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎక్కడ పోటీ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news