ఆ విష‌యాల‌పై మౌనంగా ఉంటున్న ష‌ర్మిల‌.. కేసీఆర్ స్కెచ్ అదుర్స్‌!

తెలంగాణ‌లో కేసీఆర్ ఏది చేసినా దాని వెన‌క ఓ గ‌ట్టి కార‌ణం ఉంటుంది. అది ఇన్‌డైరెక్టుగా ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెడుతుంది. ఇప్పుడు కూడా అదే విధంగా డైరెక్టుగా మాట్లాడ‌కుండానే ఇన్ డైరెక్టుగా వారి నోటికి తాళం వేసేశారు. అది కూడా ఎవ‌రికో కాదు తెలంగాణలో పార్టీ పెట్టి స్థిర‌ప‌డాల‌ని భావిస్తున్న వైఎస్ షర్మిలకు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ‌లోని కృష్ణా జలాల్నిఏపీ దోచుకుంటోందని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నీటి దొంగ అని రీసెంట్ గా మంత్రులు కామెంట్ చేశారు. అంతే కాదు ఆయ‌న కొడుకు జగన్ కూడా గజదొంగ అని తీవ్రంగా మంత్రులు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ విష‌యాలు అన్నీ కూడా షర్మిలకు షాకిచ్చే పనిలో భాగంగానే చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎందుకంటే త‌న తండ్రిని, అన్న‌ను అన్ని మాట‌లు అన్నా కూడా ఆమె ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉండిపోతోంది. ఎందుకంటే వాటికి రిప్లై ఇస్తే జరిగే నష్టం ఏమిటో షర్మిలకు బాగా తెలుసు. అందుకే త‌న తండ్రిని అన్ని మాట‌లు అన్నా కూడా ఆమె మౌనంగా ఉండిపోతున్నారు.