ఈ ఒక్క జగన్‌ ఫోటో… ఎన్నో ప్రశ్నలకు సమాధానం

-

ఈ నెల 21వ తేదీన 52వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున అట్టహాసంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు విడుదల చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా సోషల్‌ మీడియా షేర్‌ చేసుకుంటున్నారు. ఈ ఫోటో డిజైన్‌ చేసిన వారు ఎవరో కానీ వైసీపీ శ్రేణులు అమితానందం వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ఫోటో ఒక్కటి ఉంటే చాలు తరాల వరకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటున్నారు. నాలుగున్నరేళ్ళ సీఎం జనరంజక పాలనకు అద్దం పడుతూ అనేక విమర్శలకు ఒకే సమాధానంగా నిలుస్తోంది ఈ ఫోటో.

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది అంటారు.ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఫోటో అలాంటి వేల భావాలను కళ్ళకు కడుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ వారిని తన సొంతవారిలా అక్కున చేర్చుకుంటున్నారు అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

జనామోద పాలనకు అద్దం పడుతోంది ఈ ఫోటో. అందమైన పల్లె వాతావరణంలో పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల భవనం, గ్రామ సచివాలయం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి.సీఎం వైయస్ జగన్‌ పాలనలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు అనేందుకు ఈ ఒక్క ఫోటో నిదర్శనం. సాధారణం కంటే భిన్నంగా ఉన్న ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది.

పండగ, మరేదైనా శుభకార్యం నేపథ్యంలో సాధారణంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం పరిపాటి. ఇది అందరూ చేసేదే. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. నాలుగేళ్ళలో విప్లవాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, పరిపాలనలో తీసుకువచ్చిన సమూల మార్పులకు ప్రతిరూపంగా రాష్ర్టమే ఓ వసుదైక కుటుంబం అనేలా రూపొందించిన ఈ ఫ్లెక్సీ ప్రజలను కట్టిపడేస్తోంది.

ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజలు మనసు పారేసుకుంటున్నారు.ఆరాధన భావనతో మనసులో దాచేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన శ్రేణులు ఫోన్ స్క్రీన్ లలో, వాట్సప్ స్టేటస్ లలో సోషల్ మీడియా వేదికల్లో షేర్‌ చేస్తూ సేవ్ చేసుకుంటున్నారు.ఈ ఫ్లెక్సీ కేవలం గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ చిత్రంపై ప్రస్తుతం విస్తృత ప్రచారం జరుగుతోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఫోటోకి అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.ఈ నెల 21న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.అప్పటికి ఈ ఫోటోతో వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్‌ వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అవకాశం దొరికితే వైసీపీ సర్కారుపై బురద చల్లేందుకు సిద్ధంగా ఉండే ఎల్లో మీడియా బ్యాచ్‌ ఇప్పుడు దీనిని విమర్శనాత్మక వస్తువుగా మార్చుకునేందుకు తెగ ఆరాటపడుతోంది.ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల గుండెల్లో సీఎం జగన్‌ రూపాన్ని చెరపలేరు అనేందుకు ఇది ఒక చక్కని ఉదాహరణ.

Read more RELATED
Recommended to you

Latest news