జగన్ ని ఆపుతున్న ఏదో శక్తి…

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార వైసీపీలో ఏదో జరుగుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. సిఎం వైఎస్ జగన్ ని ఇబ్బంది పెట్టడానికి గానూ కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి అనే అనుమానాలు వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కొందరు చేస్తున్నారు. ఇక ఢిల్లీ పర్యటనకు జగన్ వెళ్లకపోవడం వెనుక ఎవరో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో ఆయన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఢిల్లీ పర్యటన రద్దు కావడానికి అమిత్ షా షెడ్యుల్ మారడమే ప్రధాన కారణం అని భావించారు అందరూ… కాని అది నిజం కాదని తర్వాత తెలిసింది. ఎవరో ఏపీ నుంచి చక్రం తిప్పుతున్నారని సొంత పార్టీలోనే జగన్ ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా జగన్ బలంగా ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అత్యంత బలమైన ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరు. ఆయనను ఇబ్బంది పెట్టే దమ్ము తెలుగుదేశానికి లేదు అనేది కొందరి మాట. ఇప్పుడు పరిస్థితి ఏదో తేడాగా ఉందని జగన్ భావిస్తున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం, డాక్టర్ సుధాకర్ వ్యవహారం, అలాగే హైకోర్ట్ ఇటీవల రమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు ఇలాంటి వ్యవహారాలూ కొన్ని తనకు ఇబ్బందిగా ఉన్నాయని జగన్ భావిస్తున్నారు. కొన్ని శక్తులు తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని జగన్ భావించి కొందరిని దూరంగా పెట్టారు అని అంటున్నారు. కొంత మంది కొన్ని ప్రాంతాల్లో వర్గాలను తయారు చేసుకుంటున్నారు అనే సమాచారం కూడా జగన్ వరకు వచ్చింది. అందుకే ఇప్పుడు ఆయన ఎవరిని నమ్మడం లేదు అనేది రాజకీయ పరిశీలకుల మాట.