ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో బిజెపి, జనసేన కలసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తాం, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం రూ. 55 వేల కోట్లు నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. డబ్బులు డ్రా చేయాలని తపన తప్ప ప్రాజెక్టులు గురించి రాష్ట్ర ప్రభుత్వం అలోచన చేయడం లేదని ఆయన విమర్శించారు. రాయలసీమ ఉండే నీటి సమస్యపై ఈ నెల 19 న రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా కడప లో బిజెపి భారీ ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు సోము వీర్రాజు. రాయలసీమను రత్నాల సీమగా చూడాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు.
కేంద్రం ఇచ్చిన NREGS నిధులతో గతంలో చంద్రన్న భాట, ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలు, జగనన్న ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కట్టారని అన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద నగరంలో 16 లక్షలు ఇల్లు, పంచాయతీల్లో 5 లక్షలు ఇల్లు నిర్మిస్తాం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 వేలు కోట్లు జగనన్న కాలనీలకు ఉపయోగించారు,అవి జగనన్న కాలనీ కాదు మోడీ కాలనీలని అని అన్నారు.