ఆర్థికంగా అండగా నిలుస్తా అంటున్న సోనియా…?

-

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా చాలా మంది నేతలు బలంగా ఉన్నా సరే తెలంగాణలో పార్టీని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూల పరిస్థితులు ఉన్నా సరే వాటిని సమర్ధవంతంగా వాడుకునే విషయంలో నాయకత్వం ముందుకు అడుగు వేయలేకపోతోంది.

పార్టీల అగ్రనేతలు కొంత మంది ఉన్నా సరే వాళ్ళు ఆర్థికంగా పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పాలి. దాదాపుగా మంత్రి పదవులు అనుభవించిన వారిలో ఎంపీలు గా పని చేసిన వాళ్ళు కేంద్ర మంత్రిగా పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎవరు కూడా పార్టీ కోసం ముందుకు రాకపోవడం పట్ల ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.

భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది నేతలు పార్టీ కోసం సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుందని చాలా మంది ఆర్థికంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆర్థిక సమస్యలను తీర్చడానికి సిద్ధమైందని తెలంగాణ కాంగ్రెస్ కోసం పని చేసే బలమైన నేతలను గుర్తించి వారికి అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం కూడా అందించే విధంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news