కాంగ్రెస్ అధిష్టానంను కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ తక్కువ అంచనా వేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఇన్ని రోజులు కూడా నమ్మకమైన నేతల విషయంలో కాస్త వదులుగా ఉంటూ వచ్చింది. అందులో సచిన్ పైలెట్ కూడా ఒకరు. ముందు నుంచి కూడా రాజస్థాన్ లో ఆయనకు మంచి ప్రాధాన్యత కాంగ్రెస్ నుంచి ఉండేది.
ఇక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన విషయంలో అన్ని విధాలుగా న్యాయం చేసింది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో జ్యోతిరాదిత్య సింధియా తరహాలలో తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో అందరూ ఆయన డిమాండ్ కు తలొగ్గే అవకాశం ఉంది అని భావించారు. కాని అనూహ్యంగా సోనియా తన మార్క్ రాజకీయం చూపించి గంటల వ్యవధిలో ఆయనను పదవుల నుంచి తప్పించారు.