కొడాలి నానిపై శ్రీనివాసానంద సరస్వతి పోటీ?

మైకులముందు మాట్లాడటానికి.. మీడియా పులులుగా మారడానికి.. నిజజీవితంలో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించడానికి ఉన్న తేడా ఎంత అనేది తెలియాలంటే చాలా కష్టం అనే విషయం తెలుసుకోవాలనో ఏమో కానీ… గొప్ప మనుషులు, సరస్వతీ పుత్రులు, సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లున్నారు. అందులో భాగంగా కొడాలి నానిపై గుడివాడ నుంచి పోటీచేయాలని పరితపిస్తున్నారు!

అవును… విషయం ఏదైనా, ఎలాంటిదైనా దాన్ని రాజకీయాలకు ముడిపెట్టేసి.. సాధులు సైతం రాజకీయ నాయకులకు మించిన రాజకీయ విమర్శలు, ఛాలెంజ్ లు విసిరేస్తున్నారు. ఫలితంగా మనుగడను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా… జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మొదలుపెట్టిన సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి… కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే హిందువుల శక్తి ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. ఆయన పవితమైన నోటి నుంచి… కొడాలి నాని అచ్చోసిన ఆంబోతని వ్యాఖ్యానించారు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద సరస్వతి!

దీంతో… కొడాలి నానిపై రాబోయే ఎన్నికల్లోనో లేక ఏదైనా మద్యంతర ఎన్నికలు వస్తేనో టీడీపి – బీజేపీ తరుపున గుడివాడ నుంచి శ్రీనివాసానంద సరస్వతి పోటీచేసే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు! వారూ వీరు సత్తా చూపించడం ఎందుకు.. స్వయంగా శ్రీనివాసానంద సరస్వతే పోటీచేయాలని కోరుకుంటున్నారు బీజేపీ – టీడీపీ కార్యకర్తలు! ఆ ఎన్నిక ఫలితాలను బట్టి ఎవరు అచ్చోసిన ఆంబోతో తేలిపోతుందని అంటున్నారు విశ్లేషకులు!!

-CH Raja