ఆటంకాలు ఎదురైనా వెన‌క్కి త‌గ్గం : మూడు రాజ‌ధానుల‌పై సీఎం జ‌గ‌న్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి మూడు రాజ‌ధానుల విషయంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టన చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. మూడు రాజ‌ధానుల విషయంలో వెనక్కి త‌గ్గం అని సీఎం వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అలాగే తమ ప్ర‌భుత్వం వికేంద్రీక‌ర‌ణ విషయంలో వెనుగ‌క‌డుగు కూడా వేయ‌బోమ‌ని తెల్చి చెప్పారు. కాగ త‌న‌కు అమ‌రావ‌తి అంటే ప్రేమ ఉంద‌ని అన్నారు. అందుకే అమ‌రావ‌తిలో ఇల్లు క‌ట్టుకున్నాన‌ని అన్నారు. అలాగే అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించాన‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే చంద్ర బాబుకు అమ‌రావ‌తిపై ఇష్టం లేద‌ని అన్నారు. రాజ‌ధాని నిర్మించాల‌నే ఇష్టం చంద్ర బాబుకు ఉంటే.. రాజ‌ధానిని విజ‌య‌వాడ లేదా గుంటూర్ లో పెట్టేవార‌ని అన్నారు. ఈ రెండు న‌గ‌రాలు ఇప్ప‌టికే అభివృద్ధి చెంది ఉన్నాయ‌ని అన్నారు. దీంతో 500 ఎక‌రాల్లో ప్ర‌భుత్వ భ‌వ‌నాలను నిర్మిస్తే.. రాజ‌ధాని అయ్యేద‌ని అన్నారు. అలా కాద‌ని అమ‌రావ‌తిని నిర్మించ‌డానికి అనాడే.. రూ. 1.09 ల‌క్షల కోట్ల‌ను అంచ‌నా వేశార‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగూణంగా రాజ‌ధానిని నిర్మించాలంటే.. దాదాపు 40 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news