సంక్షేమ కార్యక్రమాలతో తన మార్క్ పాలనను చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కీలక అడుగు వేసారు. గురువారం అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి, సంక్రాంతి తర్వాత మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడులలో అమలు చేసే మధ్యాహ్న భోజన విషయంలో కాస్త రుచితో పాటు మెనూ ని కూడా పెంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
సంక్రాంతి తర్వాత జనవరి 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఈ కార్యక్రమం కోసం దీనికోసం ఏపీ ప్రభుత్వం అదనంగా రూ.353 కోట్లు కేటాయించింది.
ఒకసారి మెనూ చూస్తే;
సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, చిక్కి
మంగళవారం : పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం : కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి.