శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాళీ అయిన చైర్మన్ స్థానంలో మరొకరిని నియమించవద్దని భావిస్తుంది. ఆ స్థానంలో మరో రెండు డైరెక్టర్ పదవులను నియమించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా టీటీడీ అదనపు ఈవో గా ఉన్న ధర్మా రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా ఎస్వీబీసికి చైర్మన్ గా ఉన్న హాస్య నటుడు పృథ్వీ రాసలీలలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనితో ఆయన రాజీనామా చేస్తూ ఎస్వీబీసి నుంచి బయటకు వెళ్ళారు. ఇక ఈ నేపధ్యంలో అప్పటి నుంచి ఆ పదవికి చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. సాక్షి టీవీ లో కీలక యాంకర్ గా ఉన్న స్వప్నని నియమించాలని జగన్ భావించారు.
ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిని నియమించే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అలాగే దర్శకుడు శ్రీనివాస రెడ్డి పేరు కూడా వినిపించినా అవన్నీ వాస్తవం కాదని తెలిసింది. పృథ్వీ వ్యవహారం తర్వాత ఛానల్ లో అక్రమాలపై టీటీడీ విజిలిన్స్ దృష్టి సారించింది. ఆయన ఉన్న సమయంలో ఉద్యోగాలను డబ్బులు తీసుకుని ఇచ్చారనే ఆరోపణలు సంస్థ ఉద్యోగుల నుంచి వచ్చాయి.