మళ్ళీ ఎబిఎన్ ని నమ్ముతున్న టీడీపీ, ఈసారి లోతుగా ముంచేస్తాడా…?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా ఉన్న ఆంధ్రజ్యోతి ఎన్నికల ప్రచారం సమయంలో తమ పేపర్ లో, టీవీ లో ప్రసారం చేసిన కథనాలు చూసి తెలుగు తమ్ముళ్ళు నిజమే అనుకున్నారు. ముఖ్యంగా రాధాకృష్ణ నేతృత్వంలోని ఏబీఎన్ రాసిన కథనాలలో ప్రధానంగా చెప్పుకునేది, జగన్ ప్రచారానికి జనం రావడం లేదు కాబట్టి ఇరుకు సందుల్లో ప్రచారం చేస్తున్నారు అని.

గుడివాడ లాంటి చోట షర్మిలకు జనం రాలేదు అనే విషయాన్ని ఆ ఛానల్ ఎక్కువగా కవర్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత 67 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఎండ, అది ఇది అని లేకుండా ప్రచారం చేస్తుంటే జగన్ మాత్రం మూడు రోజులు విశ్రాంతి ఎక్కువగా తీసుకున్నారని అనవసర ప్రచారం చేసారు. ఓటింగ్ అయిన తర్వాత కూడా చంద్రబాబుని ఓడించాలనే కసి ఆడవాళ్ళల్లో ఎందుకు ఉంటుంది అంటూనే,

అర్ధ రాత్రి వరకు ఓటు వెయ్యాల్సిన అవసరం ఆడవాళ్లకు ఏంటీ అని రాధాకృష్ణ తన అభిప్రాయంలో ప్రస్తావించారు. ఇది కూడా నమ్మారు తెలుగు తమ్ముళ్ళు. అప్పుడు అలా మునిగిపోయింది తెలుగుదేశం. ఇప్పుడు కూడా దాదాపుగా అదే జరుగుతుంది. మీడియాలో ఎక్కువగా అనవసర ప్రచారం చేయడం మొదలుపెట్టారు. జగన్ రేపో మాపో జైలుకి వెళ్తున్నారు. ఇక ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా ఆగిపోయాయి.

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రధాన కారణం వేరే ఉంది అంటూ మీడియాలో రాస్తున్న రాతలను మళ్ళీ టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. జగన్ పై వ్యతిరేకత ఉందని మీడియాలో కథనాల ఆధారంగా చెప్తున్నారు. వాస్తవ పరిస్థితులను కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. దీనితో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నమ్మి మునిగిన తర్వాత మళ్ళీ ఎందుకు మునుగుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news