టీడీపీలో భారీ ట్విస్ట్..చంద్రబాబుకు కొత్త తలనొప్పి.!

-

రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని చెప్పి టి‌డి‌పి అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే..ఓ వైపు ప్రజల్లో తిరుగుతూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు..అటు లోకేష్ పాదయాత్రతో పార్టీకి మరింత ఊపు తెస్తున్నారు. ఇలా పార్టీ కోసం కష్టపడుతున్నారు. కానీ పార్టీలో ఉండే కొందరు నేతలు..అంతర్గత విభేదాలతో డ్యామేజ్ చేస్తున్నారు. చంద్రబాబు ఇంకా సీట్లని ప్రకటించలేదు.

కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ప్రకటించారు..అలాగే కొందరు సీనియర్లకు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..అంతే తప్ప క్లారిటీగా సీట్లు ఫిక్స్ చేయలేదు. కానీ కొందరు నేతలు పలు స్థానాల్లో సీట్ల కోసం ఇప్పటినుంచే కుమ్ములాటలకు దిగుతున్నారు. సీటు తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలా వర్గాలు పెరగడం పార్టీకి నష్టమే. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో టీడీపీలో ఊహించని పోరు మొదలైంది. ఇక్కడ సీటు కోసం నేతల మధ్య పోటీ స్టార్ అయింది.

వాస్తవానికి ఈ సీటు కాగిత కృష్ణప్రసాద్..తన తండ్రి కాగిత వెంకట్రావు మొదట నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఇక 2014లో ఆయన పెడన నుంచి గెలిచారు..వయసు మీద పడటంతో 2019లో తన తనయుడుకు సీటు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. జనసేన ఓట్లు చీల్చడంతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల తర్వాత కాగిత వెంకట్రావు అనారోగ్యంతో చనిపోయారు.

అప్పటినుంచి కృష్ణప్రసాద్…పార్టీ ఇంచార్జ్ గా కష్టపడుతున్నారు..నియోజకవర్గంలో బలం పెంచుకున్నారు. గెలుపు దిశగా వెళుతున్నారు. నెక్స్ట్ ఆయనకే సీటు ఫిక్స్ అనుకున్న తరుణంలో సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ పెడన సీటు తనదే అని ప్రకటించుకున్నారు. చంద్రబాబు సీటు ఇంతవరకు ఎవరికి ప్రకటించలేదని, కానీ తాను ఒప్పించుకుని సీటు తీసుకుంటానని అంటున్నారు. ఇలా సీటు తనదే అనడంపై కాగిత వర్గం గుర్రుగా ఉంది. ఇలా పెడన సీటులో కన్ఫ్యూజన్ మొదలైంది. ఇక దీంతో బాబుకు మరో తలనొప్పి తయారైంది. దీనికి బాబు చెక్ పెట్టాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news