టీడీపీ హ్యాట్రిక్ సీటులో వైసీపీ పాగా?

-

అది తెలుగుదేశం పార్టీ కంచుకోట..గత మూడు ఎన్నికల నుంచి అక్కడ తెలుగుదేశం జెండా ఎగురుతుంది. రాష్ట్రంలో పరిస్తితులు ఎలా ఉన్న అక్కడ గెలిచేది టి‌డి‌పి. అంటే టి‌డి‌పికి అలాంటి పట్టున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గం ఏదో కాదు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం…2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టి‌డి‌పి విజయం సాధించింది.

గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ వేవ్ ఉన్నా సరే మండపేటలో టి‌డి‌పి గాలి నడిచింది. ఇక గత మూడు ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు. అయితే వివాదాలకు దూరంగా ఉండే వేగుళ్ళకు ప్రజా మద్ధతు కాస్త ఎక్కువే. సౌమ్యుడుగా ఉంటూ ప్రజల్లోనే ఎక్కువ తిరుగుతారు. అందుకే వరుసగా గెలిచారు. ఇక నాలుగోసారి కూడా ఈయన పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు వైసీపీ నుంచి వేగుళ్ళ చెక్ పెట్టే నాయకుడు దొరకలేదు. కానీ గత ఎన్నికల తర్వాత తోట త్రిమూర్తులు రూపంలో వేగుళ్ళకు బలమైన ప్రత్యర్ధి దొరికారు.

టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన తోట..మండపేట ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచేలా పనిచేస్తూ వస్తున్నారు. పంచాయితీ, స్థానిక ఎన్నికలు, మండపేట మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకునేలా చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ దక్కింది. నెక్స్ట్ వైసీపీ నుంచి మండపేట బరిలో ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం అక్కడ తోటకే లీడ్ కనిపిస్తుంది. దాదాపు నెక్స్ట్ తోట గెలుపుకు ఛాన్స్ ఉంది. కాకపోతే ఒక చిక్కు ఉంది. ఇక్కడ టి‌డి‌పి, జనసేన వేరుగా పోటీ చేస్తే తోట గెలుపు పక్కా..కలిస్తేనే డౌట్. ఎందుకంటే గత ఎన్నికల్లో టి‌డి‌పి 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే..జనసేనకు 35 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే కాస్త టఫ్ అవుతుంది. చూడాలి మరి మండపేటలో టి‌డి‌పి గెలుపుకు తోట బ్రేక్ వేస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news