నరసన్నపేట సెగ్మెంట్‌పై రామ్మోహన్‌నాయుడు ఆసక్తి మరి చంద్రబాబు ఛాన్సిస్తారా

-

ఎంపీ కింజారపు రామ్‌మోహన్‌ నాయుడు ఈ సారి అసెంబ్లీ వైపు చూస్తున్నారు. 2019లో ఇష్టం లేకపోయినా చంద్రబాబు ప్రోద్బలంతో ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. టెక్కలి స్థానం నుంచి ఖచ్చితంగా బాబాయ్ అచ్చెన్నాయుడు పోటీ చేస్తారు. కాబట్టి ఒకే కుటుంబంలో ఇద్దరికి అసెంబ్లీ సీట్లు కేటాయించడం వలన లేనిపోని తలనొప్పులు ఉంటాయన్నది అధిష్టానం మాట.

Ram Mohan Naidu Kinjarapu Wallpapers | All India Daily

ఒకవేళ పార్టీ పవర్ లోకి వస్తే మంత్రి పదవుల పంపకంలోనూ ఇబ్బంది తలెత్తుంతుందని అధిష్టానం యోచిస్తోంది. ఇంకో సమస్య ఏంటంటే ఎంపీగా పోటీ చేయకుండా రామ్మోహన్‌నాయుడు పక్కకు తప్పుకుంటే అక్కడ పోటీ చేసేందుకు టీడీపీకి బలమైన నాయకుడు కావాలి. ఇప్పుడు ఆలాంటి నేతను వెతకడం కూడా టీడీపీకి సమస్యగా మారే అవకాశం ఉంది.

రామ్మోహన్ నాయుడు తన ఆలోచనను ఏమాత్రం దాచుకోకుండా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే నరసన్నపేట నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అక్కడ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను టీడీపీలోకి ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇక్కడ వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో ధర్మాన క్రిష్ణదాస్ గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా మూడేళ్ళ కాలం పనిచేశారు. అంతకుముందు 2004,2009, అలాగే 2012 ఉప ఎన్నికల్లో కూడా ఇదే సీటు నుంచి గెలిచారు. అంటే ధర్మాన కుటుంబానికి ఇది కంచుకోట అని చెప్పుకోవాలి. 2024లో కూడా కృష్ణదాస్‌ ఇక్కడి నుంచి ఖచ్చితంగా గెలుస్తారు అని వినిపిస్తోంది. అయినప్పటికీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని రమ్మోహన్‌నాయుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

రామ్మోహన్ మాత్రం ఈసారి పట్టు విడిచేలా కనిపించడం లేదు.ఆయన నరసన్నపేటలో తన రాజకీయ యాక్టివిటీ స్టార్ట్ చేసి ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా టీడీపీ మీద పట్టు సాధించాలన్నది రామ్మోహన్ పక్కా వ్యూహంగా ఆయన అనుచరులు చెబుతున్నారు.ఎర్రన్నాయుడుకు అసలైన వారసుడు తానే అని ఋజువు చేయాలనుకుంటున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news