అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా TCS

-

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఈ పేరు తెలియని వారుండరేమో. టెక్నాలజీ రంగంలో అత్యంత ఉత్తమ సేవలను అందిస్తున్న ప్రముఖ సంస్థల్లో టీసీఎస్​ది ప్రత్యేక స్థానం. అందుకే ఈ కంపెనీ  భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. అత్యుత్తమ 50 బ్రాండ్‌లతో ఈ జాబితాను ఇంటర్‌ బ్రాండ్‌ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ.1,09,576 కోట్ల బ్రాండ్‌ విలువతో టీసీఎస్‌ మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.65,320 కోట్లు), ఇన్ఫోసిస్‌ (రూ.53,324) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

గత దశాబ్ద కాలంలో ఇతర రంగాలను అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో నిలిచింది. అగ్రగామి 5 బ్రాండ్‌లలో 3 స్థానాలను టెక్నాలజీ కంపెనీలే సాధించాయి. ఆర్థిక సేవల రంగం నుంచి 9 సంస్థలు జాబితాలో చోటు పొందాయి. హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా రంగం నుంచి 7 కంపెనీలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి.

 గత పదేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రంగం 25 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదుచేస్తోంది. హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా (17 శాతం), టెక్నాలజీ (14 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news