మర్కజ్ నెంబర్ ని టీడీపీ ఎందుకు కావాలనే ఇగ్నోర్ చేస్తోంది ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో మర్కజ్ మసీదు సీన్ మొత్తం రివర్స్ చేసిందని చెప్పవచ్చు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారి కేసులు బయటపడక ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలావరకూ కరోనా వైరస్ అదుపులో ఉంది. ముఖ్యంగా విదేశీయులను కట్టడి విషయంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ కావడంతో వాళ్లు బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయగలిగారు.AP min spends Rs 3 lakh for root canal treatment | Deccan Heraldఅయితే ఎప్పుడైతే  మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టులు రావడం జరిగిందో ఒక్కసారిగా ఊహించని విధంగా కేసులు ఏపీలో పెరిగిపోయాయి. దీంతో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగి…కరోనా వైరస్ విషయంలో దేశంలోనే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం స్టార్ట్ చేశారు. ఎక్కడా కూడా ఢిల్లీ మత ప్రార్థనలు గురించి ప్రస్తావన తీసుకు రాకుండా తెలుగుదేశం పార్టీ కావాలనే ఇగ్నోర్ చేస్తూ విమర్శలు చేస్తున్నట్టు యనమల రామకృష్ణుడు చేస్తున్న కామెంట్లు బట్టి అర్థమవుతోంది.

 

మర్కజ్ మసీదు ప్రార్థనల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగింది అని అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కరోనా కేసుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా సులువుగా చెప్పేస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ గా ముస్లిం ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవడానికి మర్కజ్ నెంబర్ ని ప్రస్తావించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇదే విషయాన్ని చాలా మంది పార్టీలో సీనియర్ రాజకీయ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news