నెల్లూరు ఎంపీ అభ్యర్థి కోసం టిడిపి తంటాలు.. అయోమయంలో క్యాడర్..

-

నెల్లూరు జిల్లాలో వైస్సార్సీపీ బలంగా వుంది.. దాన్ని ఢీ కొట్టెందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. నేతల నుంచి సహకారం అందడం లేదు.. అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నా.. ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.. దీంతో ఎంపీ అభ్యర్థి గా ఎవరిని నిలబెట్టాలో అర్థం కాక టిడిపి నానా తంటాలు పడుతుంది..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కావలి మాజీ ఎమ్మెల్యే బీదమోస్తాన్రావు ఎంపీగా పోటీ చేశారు.. చివరి నిమిషంలో ఆయన పేరును అధిష్టానం ఖరారు చేయడంతో ఇష్టం లేకపోయినా ఆయన బరిలోకి దిగారు.. ఓటమి చెందిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.. ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో టిడిపి అధిష్టానం తల పట్టుకుంటుంది.. సీనియర్ నేతలుగా ఉన్న కొందరు పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది..

సర్వేపల్లి నియోజకవర్గం లో ఐదు సార్లు ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పార్లమెంటుకు పంపాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారట.. ఇదే విషయాన్ని సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ససేమిరా అన్నారని పార్టీలో చర్చ నడుస్తుంది.. తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని ఎంపీగా పోటీ చేయనని సోమిరెడ్డి అధిష్టానానికి చెప్పారట.. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని కూడా ఎంపీగా పోటీ చేయాలని కోరారట.. అందుకు ఆనం కూడా ఆసక్తి చూపకపోవడంతో టిడిపి అధిష్టానం డైలమాలో పడిందని జిల్లాలో చర్చ నడుస్తోంది..

ముఖ్య నేతలందరూ ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో.. టిడిపి జిల్లా అధ్యక్షులు ఉన్న అబ్దుల్ అజిజ్ లేదా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డిని బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట.. నెల్లూరు జిల్లాలో ముస్లిం సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న అబ్దుల్ అజిజ్ ని ఎంపీగా పోటీ చేయించి.. తద్వారా ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను టిడిపికి డైవర్ట్ చేసేలా అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని జిల్లాలో చర్చ నడుస్తుంది.. ఇంతకీ ఎంపీగా పోటీ చేసేందుకు అబ్దుల్ అజీజ్ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news