25 సీట్ల లొల్లి..జనసేనకు టీడీపీ చెక్.?

-

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఈ సారి అలాంటి పరిస్తితి రాకూడదని చెప్పి చంద్రబాబు-పవన్ పొత్తు దిశగా అడుగులేస్తున్నారు. దాదాపు పొత్తు ఖాయమనే చెప్పవచ్చు. కానీ పొత్తు అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం. అయితే పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది పెద్ద ప్రశ్న.

ఎందుకంటే టి‌డి‌పికి 175 స్థానాల్లో పట్టు ఉంది..జనసేనకు అలా లేదు..కేవలం కృష్ణా టూ విశాఖ జిల్లాల్లోనే కొన్ని నియోజకవర్గాల్లోనే బలం ఉంది. అది కూడా గెలిచే బలం ఓ 10 సీట్లలో కూడా ఉండదు..కానీ 50 సీట్లలో గెలుపోటములని తారుమారు చేయగలదు. అందుకే టి‌డి‌పి-జనసేన కలిస్తే ఓట్ల చీలిక లేకుండా ఉంటుంది. అయితే జనసేన ఎన్ని సీట్లు కావాలని అడుగుతుంది..టి‌డి‌పి ఎన్ని సీట్లు ఇవ్వాలని అనుకుంటుందనేది పెద్ద ప్రశ్న.

ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయో తెలియదు గాని..ముందు వైసీపీ మాత్రం..పొత్తు చెడగొట్టాలనే గట్టిగా ట్రై చేస్తున్నట్లు కనబడుతోంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా ఉంటేనే వైసీపీకి ప్లస్. అందుకే పవన్‌ని ఒంటరిగా పోటీ చేయాలని, దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త చర్చ పెట్టారు. అసలు జనసేనకు పొత్తులో 25 సీట్లే దక్కుతున్నాయని వైసీపీ ప్రచారం చేస్తుంది.

ఆ 25 సీట్లతో పవన్ సి‌ఎం ఎలా అవుతారని అంటున్నారు. అంటే టి‌డి‌పి..జనసేనకు 25 సీట్లు మాత్రమే ఇస్తుందని ప్రచారం చేసి.దీని ద్వారా పొత్తులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి..టి‌డి‌పి-జనసేనల మధ్య చిచ్చు పెట్టి పొత్తు లేకుండా చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో..అసలు జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news