ఏపీ స్పీకర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే డిమాండ్

అవినీతి, అక్రమ వ్యాపారాలకు ఆదర్శంగా స్పీకర్ తమ్మినేని ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఆరోపణలు చేసారు. స్పీకర్ పదవిని తప్పుడు పనులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. సోమేశ్వరరావు విషయంలో స్పీకర్ తమ్మినేని వెంటనే క్లారిటీ ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. తమ్మినేని సీతారాం వ్యవస్థలకు, సమాజానికి, శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలన్నారు.

కానీ.. అవినీతి పరులకు, అక్రమార్కులకు ఆదర్శంగా నిలుస్తున్నారని విమర్శలు చేసారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల్లో తమ్మినేని పేరు దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియేట్ లో ఉద్యోగాల పేరుతో మోసగిస్తూ ఆయన కుర్చీని అవమానించారన్నారు. అధికారాన్ని, పరపతిని అక్రమార్జనకు, అక్రమ వ్యాపారాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆముదాలవలసలో అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు తీవ్రమయ్యాయని విమర్శలు చేసారు. నాగావళి, వంశధారను ఊడ్చేస్తున్నారన్నారు. సోమేశ్వరరావు అనే వ్యక్తి విషయంలో వచ్చే ఆరోపణలపై స్పీకర్ స్పందించాలని డిమాండ్ చేసారు. ఏ హోదాలో అసెంబ్లీ, సెక్రటేరియేట్ కు సోమేశ్వరరావు వస్తున్నారు.? అని ప్రశ్నించారు. స్పీకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.