హోంమంత్రికి క‌రోనా పాజిటివ్

-

క‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర హోంమంత్రి బ‌స‌వ‌రాజ్ సోమ‌ప్ప బొమ్మైకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు హోంమంత్రి ట్వీట్ చేశారు. త‌మ నివాసంలో ప‌ని చేసే అబ్బాయికి నిన్న క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

ఈ నేప‌థ్యంలో తాను కూడా కొవిడ్ టెస్టులు చేయించుకున్నాన‌ని, అందులో పాజిటివ్ ఫ‌లితం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని హోంమంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news