వైసీపీ తుపాను సాయం ఎవ‌రికిచ్చారో చెప్పాలి : బుద్ధా వెంక‌న్న‌

-

TDP MLC Buddha Venkanna Comments YSRCP
విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కిరాయిగూండాలు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రకటించిన రూ.50 లక్షల తుపాను సాయం ఎవరికి పంపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ శ్రీకాకుళం వెళ్లకపోవడం దారుణమని అన్నారు. తితలీ తుపాన్‌తో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే.. రాష్ట్రానికి వచ్చిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించకపోవడం బాధకలిగించిందని అన్నారు. వైసీపీ-బీజేపీ-జనసేన ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని, అప్పుడు తమ బలమేంటో, వారి బలమేంటో తెలుస్తుందని బుద్దా వెంకన్న అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news