తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ.. బీసీలకు అసలు సిసలు రాజ్యాధికారం దక్కింది.. నిరుపేద కుటుంబాల్లో పుట్టి రెక్కాడితే గాని డొక్కాడని బీసీలను రాజకీయంగా ఉన్న స్థానాల్లోకి తీసుకెళ్లింది టీడీపీయే. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్నట్టు మెజార్టీ పదవులు బీసీలకు కట్టబెట్టినా వాళ్లకు అధికారం లేకుండా డమ్మీలను చేయడం కాదు.. వాళ్లకు అసలు సిసలు రాజకీయ ఉన్నతాధికారం కట్టబెట్టమే టీడీపీ చేసింది. ఈ కోవలోనే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మెరిసిన నిజమైన బీసీ బిడ్డ దాసరి శ్యామ్ చంద్రశేషు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శేషు పార్టీలో విద్యార్థినేతగా ప్రస్థానం మొదలు పెట్టి ఈ రోజు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ప్రశంసలతో ప్రమోషన్లు ఇచ్చే స్థాయికి ఎదిగాడు.
టీడీపీలో ఒక బీసీ దమ్మున్న లీడర్‌గా ఎదగాలంటే డబ్బులక్కర్లేదు… అంగబలం, కులబలం అక్కర్లేదు. బలమైన వాయిస్, ప్రజల పక్షాన పోరాడే ధైర్యం, తెగువ ఉంటే చాలు. శేషులో కష్టపడేతత్వంతో పాటు దేనికి వెనుకాడకుండా ప్రజల పక్షాన నిలదీసే వాయిస్ ఉంది. అదే చంద్రబాబును ఆకర్షించింది. ఆంధ్రా యూనివర్సిటీలో లా చేస్తున్నప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన సీఎం. వర్సిటీలో టీడీపీ కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వ పెద్దలు, అధికారుల కన్నెర్ర చేస్తున్నారు. టీడీపీ నుంచి వర్సిటీలో జీరో యాక్టివిటీస్. ఆ టైంలో ఎలాంటి పదవి లేకపోయినా వర్సిటీలో కొందరు విద్యార్థులతో నాడే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేకత కార్యక్రమాలపై పోరాటాలు చేశారు.
ఇవి నచ్చే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శేషును ఎంకరేజ్ చేయడంతో పాటు అధిష్టానంతో నేరుగా మాట్లాడి శేషుకు ఆంధ్రా వర్సిటీ తెలుగుదేశం విద్యార్థి విభాగం అధ్యక్ష బాధ్యతలు 2008లో కట్టబెట్టాలా చేశారు. ఈ కార్యక్రమానికి అయ్యన్నతో చిక్కాల రామచంద్రరావు లాంటి సీనియర్లు హాజరయ్యారు. అప్పట్లో వర్సిటీలో నిర్జీవంగా ఉన్న పార్టీకి శేషు రాకతో జవసత్వాలు వచ్చాయి. ఒక్కసారి 2008 నుంచి 2024 వరకు టీడీపీలో శేషు ఒక్కో మెట్టు ఎదిగిన క్రమం ఇలా ఉంది.
16 ఏళ్లు ఉద్యమాల కింగ్ దాసరి శేషు :
2008లో ఆంధ్రా యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అయ్యారు. ఆ వెంటనే 2009 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వర్సిటీ టీంతో ఎంతో కష్టపడ్డా పార్టీ ఓడిపోయింది. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ కేంద్రంగా సమైక్యాంధ్రతో పాటు ఎన్నో ఉద్యమాలు చేశారు.. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎంతో పోరాడి.. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఇక 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏకైక జాతీయ కమిటీ టీఎన్ఎస్ఎఫ్ జాతీయ కమిటి. రెండు రాష్ట్రాల నుంచి కేవలం 6 గురు సభ్యులతో ఏర్పడిన కమిటీలో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమోషన్ లభించింది.
తర్వాత వర్సిటీలో పీహెచ్‌డీలో జాయిన్ అయిన శేషు 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యమాలు ఆపలేదు. 11 ఏళ్ల పాటు ఆంధ్రావర్సిటీ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉండడం పార్టీ చరిత్రలో అరుదైన రికార్డు. ఇక 2019 ఎన్నికల తర్వాత పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక 2021లో శేషు పార్టీ కోసం కష్టపడుతోన్న తీరు, అతడి బలమైన వాగ్దాటిని గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శేషును రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. లోకేష్ కూడా దీనిని బలపరచడంతో చిన్న వయస్సులోనే శేషు రాష్ట్ర కమిటీలోకి వచ్చారు.
కేవలం యేడాదిన్నర కాలంలో శేషు పోరాటం, ప్రతిపక్షంలో ఉండి బలమైన అధికార పక్షంపై ఎలాంటి భయం లేకుండా చేసిన పోరాటంతో అచ్చెన్న శేషుకు వెంటనే ప్రమోషన్ ఇస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఇది శేషు పోరాటానికి దక్కిన మరో గుర్తింపుగా చెప్పాలి. అంతకుముందు మైలవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశంసలు పొందిన శేషు ప్రస్తుతం తణుకు నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో తిరుపతి పార్లమెంటు, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలకు పార్టీ తరపున ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.
ఇక యేడాదిన్నర కాలంగా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆర్టీఎస్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్‌గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంతో పాటు పార్లమెంటు పరిధిలో జయహో బీసీ ప్రోగ్రామ్ అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో సక్సెస్ ఫుల్ చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇక కొత్త ఓటర్లకు సంబంధించి లోకేష్ లాంచ్ చేసిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో ఏలూరు పార్లమెంటు యంగ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఏ ఒక్క రోజూ పోరాటం ఆపలేదు… టీవీ చర్చల్లోనూ, సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడం, ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై వీడియోలు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయ పెద్దలు, పార్టీ సీనియర్ల నుంచి ప్రశంసలు సొంతం చేసుకున్నారు.
శేషులో వాగ్దాటి చంద్రబాబుకు ప్రత్యేకంగా ఎరుక. అందుకే రాజమండ్రి మహానాడులో చంద్రబాబే శేషును ఫస్ట్ స్పీకర్‌గా సెలక్ట్ చేసి మాట్లాడించారు. వయస్సులో ఎంతోమంది సీనియర్లతో పోలిస్తే చిన్న.. బీసీ కమ్యూనిటీ, ఆర్థిక బలం లేదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌తో పాటు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో ప్రతి రోజు తనను తాను ఫ్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్లడం విశేషం. ఏదేమైనా శేషు లాంటి బలమైన యంగ్ బీసీ లీడర్లు టీడీపీకి మరింత మంది ఉంటే పార్టీకి మరో దశాబ్దంలో బలమైన బీసీ లీడర్ల కొరత ఉండదు. పార్టీ అధిష్టానం కూడా వారిని ఈ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.