రైల్వే స్టేషన్ రోడ్డు లో గోతులు పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయచౌదరి వినూత్న నిరసన వ్యక్తం చేసారు. రోడ్డు పై ఉన్న గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో చేపలు పట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్టంలో రోడ్లన్నీ గోతులుమయంగా తయారయ్యాయి అని అన్నారు. రోడ్లు అధ్వాన్నంగా మారటం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క రోడ్డు కి కూడా మరమ్మతులు చేపట్టలేదు అన్నారు. రాజమండ్రి లో రెండు యూనిట్ల ఇసుక ను పది వేలకు విక్రయించటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా లు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నడిపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి అని డిమాండ్ చేసారు.
రహదారులు స్థితి చేపలు పెంపకానికి అనుగుణంగా ఉంది.రోడ్లు మరమ్మతులు లేక పెద్ద పెద్ద చెరువులని తలపిస్తున్నాయి.ప్రభుత్వం వైఖరి కి నిరసనగా రోడ్ల పైన చేపలు పట్టడం జరిగింది.ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అభివృద్ధి మాత్రం గడప కూడా దాటటం లేదు.#గోరంట్ల pic.twitter.com/G12o8hrJbG
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 12, 2020