బాబు సూపర్ సిక్స్‌ని నమ్మడం లేదే..తమ్ముళ్ళ ఆవేదన.!

-

ఒకసారి ప్రజల నమ్మకం పోయిన నాయకుడుకు…మళ్ళీ అదే ప్రజల నమ్మకం సాధించడం కష్టం. ఇప్పుడు ఏపీలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు పరిస్తితి కూడా అదే అవుతుంది. 2004లో ప్రజల నమ్మకం కోల్పోయిన బాబు..మళ్ళీ తిరిగి పుంజుకోవడం కోసం పదేళ్ళు పట్టింది. 2014లో మళ్ళీ గెలవగలిగారు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఇంకా ప్రజా మద్ధతు పెంచుకోవాలి.

కానీ బాబు అలా చేయలేదు..ఎన్నికల ముందు ఒకటి చెప్పడం..తర్వాత వాటిని పట్టించుకోకపోవడం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఋణమాఫీ, ఇంకా కొన్ని కీలక హామీలని విస్మరించారు. దీంతో బాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. జగన్‌ని గెలిపించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా అప్పు చేసైన సరే చెప్పిన సమయానికి పథకాలు అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జగన్ ప్రజా నమ్మకం కోల్పోలేదు. అయితే మరొకసారి అధికారంలోకి వచ్చే దిశగా జగన్ వెళుతున్నారు.

ఇదే క్రమంలో ఈ సారి అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే బాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు.  18 నుంచి 59 ఏళ్ళ మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు. ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో చదువుకునే పిల్లలు అందరికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చారు.

అటు నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన, రైతులు పడుతున్న కష్టాలు తీర్చే లక్ష్యంగా రూ.20 వేలు సాయం, ఇంటింటికి కుళాయి, బీసీలకు రక్షణ చట్టం, పేదలని ధనవంతులుగా చేస్తానని బాబు హామీ ఇచ్చారు. వీటిని టి‌డి‌పి నేతలు బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. కానీ ఈ హామీలని ప్రజలు నమ్మడం లేదు. బాబు ఇప్పుడు ఒకటి చెప్పి..అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తారని భావిస్తున్నారు. ఇలా ప్రజలు నమ్మకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు ఆవేదనతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news