Boyapati-RAPO : ‘స్కంద’గా రాబోతున్న రామ్ పోతినేని

-

 

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ / ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్​కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న మూవీకి ‘స్కంద’ (ది అటాకర్) టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ మేరకు గ్లింప్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మీరు దిగితే ఊడేది ఉండదు…. నేను దిగితే మిగిలేదుండదు’ అని హీరో చెప్పే డైలాగ్ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news