స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించి వైయస్ జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని నిరూపించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఈసారి టీడీపీ నుండి ఎక్కువగా యువతరాన్ని బరిలోకి దింపుతున్నట్లు చంద్రబాబు సహా సీనియర్ నాయకులంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా ఒక్కసారిగా టిడిపి యువతరం మీద ఇంత ప్రేమ చూపించడానికి గల కారణం గురించి రకరకాల వాదనలు వినబడుతున్నాయి. 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దొరకడం లేదని మాజీ లు కూడా ఈసారి పోటీ చేయడానికి భయపడుతున్నారు అన్న టాక్ బలంగా వినబడుతుంది. డబ్బులు వెదజల్లినా, మద్యం ఏరులై పారినా గెలుపు గ్యారెంటీ కాదు అని అసెంబ్లీ ఎన్నికలు తేల్చేశాయి. దీంతో స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ మేనియా అర్థం చేసుకున్న టీడీపీ పాతకాపులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
ఈసారి కొత్తవారికి అవకాశమిస్తామంటూ స్వచ్ఛందంగా వెనక్కి తగ్గుతున్నారు అన్న వార్త ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి. అంతేకాకుండా డబ్బులు, మద్యం పంచిన రెండు సంవత్సరాలు జైలు శిక్ష అంటూ జగన్ సర్కార్ జీవో చేయడంతో…టీడీపీ సీనియర్ నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారు అని ఇందువల్ల యువతరం మీద టిడిపి ఇంత ప్రేమ చూపుతుంది అని అంటున్నారు చాలామంది రాజకీయ రంగంలో ఉన్నవారు.