కరోనాను చంపేసిన తెలంగాణా ప్రభుత్వం…!

-

అవును తెలంగాణా ప్రభుత్వం కరోనా వైరస్ ని పూర్తిగా చంపేసింది. యుద్ధం కంటే వేగంగా స్పందించింది, మీడియా ఎంత హడావుడి చేసినా తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ ప్రతీ క్షణం కంటి మీద కునుకు లేకుండా ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనాకు చుక్కలు చూపించింది. కరోనా వచ్చిన వ్యక్తి ఎంత మందిని కలిసాడు, ఎక్కడ తిరిగాడు, ఎక్కడ ప్రయాణం చేసాడు. అతను ప్రయాణం చేసిన బస్సులో ఎంత మంది ఉన్నారు.

అతని కుటుంబ సభ్యులు ఎవరు…? అతను ఉన్న ఇల్లు, అతను ఉంటున్న కాలనీ అన్నీ కూడా జల్లెడ పట్టిది. ఎక్కడా కూడా వ్యాధి వ్యాపించకుండా ప్రజలను అప్రమత్తం చేసింది. అన్ని చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేబినేట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశాలు, కీలక ఆదేశాలు, నిధులు విడుదల చేయడం, ఎక్కడా కూడా చిన్న విమర్శ రాకుండా, వీధుల్లో సానిటేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా కు చుక్కలు చూపించింది.

మాకు తెలియకుండా నువ్వు మా గడ్డ మీద అడుగుపెట్టావ్, నీకు తెలిసి నిన్ను మేము పంపిస్తున్నాం అంటూ తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు చుక్కలు చూపించింది. అనుమానం ఉన్న రోగులను వెంటనే ఆస్పత్రులకు తీసుకొచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రులకు అధికారాలు ఇచ్చింది. పేదలు ఇబ్బంది పడకుండా ఆదేశాలు ఇచ్చింది. ఐటి కంపెనీలకు పలు కీలక సూచనలు చేసింది. ఆరోగ్య విభాగమే కాదు పోలీసు విభాగం కూడా అప్రమత్తమైంది.

జనసంద్రత ప్రాంతాల్లో జనాలకు అవగాహన కల్పించింది. మైండ్ స్పేస్ లో ఉద్యోగికి అనుమానం వస్తే 12 అంతస్తుల భవనం ఖాళీ చేయించింది పోలీసు విభాగం. శానిటేషన్ పూర్తి చేసారు. అన్ని శాఖలు సమన్వయం తో పని చేసాయి. కెసిఆర్ కూడా నిధులు అవసరమైతే ఎంతైనా తీసుకోండి. కరోనా అనే పేరు వినపడకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా కరోనాను తెలంగాణా బిడ్డకు రానీయకుండా జాగ్రత్త పడింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశానికి ఆదర్శంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news