ఇండియా టుడే సర్వేతో ఆవిరైన తెలుగు తమ్ముళ్ల ఆశలు!

-

లోకేష్ తో పార్టీకి మైనస్సే
జగన్ కు, లోకేశ్ కు మధ్య నక్కకూ- నాగలోకంకు ఉన్నంత వ్యత్యాసం
చంద్రబాబుపై ఏపీ ప్రజలకు భ్రమలు తొలగాయి
వైసీపీ వైపు ఆశావహుల చూపు
ఖాళీల్లేవ్, చేర్చుకోవడాల్లేవ్ అంటున్న జగన్

ఇండియా టుడే పోల్ సర్వే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డికే మెజార్టీ ప్రజలు ఓటు వేసినట్లు ఇండియాటుడే సర్వే స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఉత్సాహం నీరుగారిపోయింది. 2019లో జరిగే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు అన్న ఇండియా టుడే సూటిప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ జగన్ అని సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పారు. చంద్రబాబు పేరు కేవలం 38 శాతం చెబితే…ఇక పవన్ స్టార్…పవర్ స్టార్ అనుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 5 శాతం ఓట్లు సాధించారు.

2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీకి 44.35 శాతం ఓట్లు పోలవగా…తెలుగుదేశం, బిజేపీ, పవన్ కూటమికి 46 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 1.65 శాతం ఓట్ల తేడాతో చంద్రబాబునాయుడు ఏపీలో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీతో బిజేపీ లేదు, పవన్ కళ్యాణ్ కూడా దూరం జరిగారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి టిడిపి పోటీ చేసినా కాంగ్రెస్ ఓటు టిడిపికి పడే అవకాశాలు నామ మాత్రమే అని కూడా ఇండియా టుడే సర్వే తేల్చింది. పైగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఇంకా కనీసం పదేళ్లయినా పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం నిజం చెప్పాలంటే సిపిఐ,సిపిఎం పార్టీల కంటే కూడా బలహీనంగానే ఉంది. కాబట్టి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేస్తున్న లాలూచీ రాజకీయాలు కూడా ఫలితమివ్వమని స్పష్టమైంది. ఇక పవన్ కళ్యాణ్, బిజేపీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందని ఇన్నాళ్లు చంకలు గుద్దుకుంటున్న తెలుగుదేశం వర్గాల ఆశలు కూడా ఈ సర్వే రిపోర్టుతో అడియాశలయ్యాయి. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, బిజేపీ, వామపక్షాలు విడివిడిగా పోటీ చేసినా… ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ శాతం పడుతుందని కూడా ఇండియా టుడే సర్వే తేల్చింది.

మహాభారతంలో ఉత్తర కుమారుడు లాంటి నారా లోకేశ్ సారధ్యంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కూడా అధికారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మాస్ ఇమేజ్ లోనూ… నాయకత్వ లక్షణాల్లోనూ, విషయాలు, రాజకీయాల పట్ల అవగాహనలోనూ వైఎస్ జగన్కు, నారా లోకేశ్ కు మధ్య నక్కకూ, నాగ లోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉందని తెలుగుదేశం నాయకులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇండియా టుడే సర్వే తర్వాత చాలామంది తెలుగుదేశం నాయకులు జగన్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీలో ప్రజాభిమానం కోల్పోయిన తెలుగుదేశం నేతలను చేర్చుకోవడానికి ఖాళీల్లేవు… ఉన్నా చేర్చుకోవడాలు అంతకన్నా లేవని జగన్ తెగేసి చెప్పారట.

సర్వే రిపోర్టులు చూసి ప్యాంట్లు తడుపుకుంటున్న తమ్ముళ్లు
2019లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై ఇటీవల తెలుగుదేశం పార్టీ సొంత టీంతో చేయించుకున్న సర్వే రిపోర్టులు ఆ పార్టీలోనే కలకలం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, ప్రభుత్వ అధికారుల అండదండలు చూసుకుని పలు అవినీతి, అక్రమాలు, కబ్జాలకు పాల్పడిన తెలుగు తమ్ముళ్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ హవా ఉండబోతోందని తెలిసి ప్యాంట్లు తడుపుకుంటున్నారు. జగన్ వస్తే తామంతా ఊచలు లెక్కించాల్సిందేనని నిద్దురలేని రాత్రులు గడుపుతున్నారు. పట్టిసీమతో సహా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయలు స్వాహా చేసిన మంత్రి దేవినేని ఉమాకు సర్వే రిపోర్టులు చూసి చలి జ్వరం వచ్చినట్లు తెలుగుదేశం నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇసుక అక్రమ రవాణా చేసి దండుకుంటున్న చింతమనేని ప్రభాకర్, ధూలిపాళ్ల నరేంద్ర కుటుంబసభ్యుడొకరు లోలోపల తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. సీమ జిల్లాల్లో ఎక్సెస్ రేట్లకు కాంట్రాక్టు పనులు దక్కించుకోవడమేగాక… నాసిరకం పనులతో బిల్లులు చేసుకుని కోట్లు వెనుకేసుకున్న కొంతమంది ప్రజాకంఠక ఎమ్మెల్యేలు వైసీపీ సానుభూతిపరులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తాము అవినీతి వ్యవహారాలపై జగన్ ప్రభుత్వం సీరియస్ అయితే ఎలా కాపాడుకోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా కొందరు వైసీపీ నేతలతో లోపాయికారి రాయబేరాలు సాగిస్తూ… ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీ మారుతామనే సందేశాలు పంపుతున్నా… జగన్ మాత్రం వాటిని లెక్క చేయడం లేదని అంటున్నారు. టిడిపి నాయకులు అధికారుల అండతో రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక మాఫియాను సృష్టించి వేల కోట్ల గడించారు. మద్యం మాఫియాను సైతం గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజధాని భూముల సేకరణలో పేదలు, రైతుల నోట్లో మట్టికొట్టి గద్దల్లా తన్నుకుపోయారు. వైఎస్ జగన్ సీఎం అయితే ఈ బకాసురులను తనదైన స్టైల్లో శిక్షిస్తారని వైఎస్ అభిమానులు నమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news