తెలంగాణాలో బలోపేతమే టార్గెట్ గా బిజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి.. ఐక్యతారాగం ఆలపిస్తున్నారు.. అదికార పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్న ఆ పార్టీ నేతలు.. బిఆర్ ఎస్ కు మించి పోరాటాలు చేసేందుకు సిద్దమవుతున్నారు.. ఉత్తర తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్న సమయంలో అందరూ సమిష్టిగా పనిచెయ్యాలని నిర్ణయించుకున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఐక్యతను చాటేలా కీలక మీటింగ్ నిర్వహించడం ప్రస్తుతం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది..
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై పోరాటాలు చేసేందుకు నేతలు నిర్ణయించారు.. రుణమాఫీ అమలు, రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేపట్టాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించిందట. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్నారని, 2003 లోనే అక్రమ నిర్మాణాలపై గుజరాత్ లో సీఎం గా మోడీ పక్షపాతం లేకుండా అందరివీ కూల్చివేశారని.. కానీ ఇప్పుడు అలా జరగడం లేదనే చర్చ వారి మీటింగ్ లో జరిగినట్లు సమాచారం..
హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న ఏకాభిప్రాయానికి నేతలు వచ్చారు.. పార్టీ నేతలందరూ అత్యవసరంగా సమావేశం కావడం.. పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. నేతలల్లో ఐక్యత లేకపోవడం వల్ల పార్టీ వాయిస్ ను బలంగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయామని.. ఇప్పుడు పరిస్థితి మారుతొందని నేతలు మాట్లాడుకుంటున్నారు..
పార్టీ ఎంపీలు, ఎమ్మేల్యేలు అత్యవసర సమావేశం నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని.. లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న ప్రచారం వేళ ప్రజాప్రతినిధుల సమావేశం సఖ్యతను చాటింది.. ఉత్తర తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు లక్ష్యంగా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఇదే తరహాలో నేతలంతా కలిసి ప్రభుత్వ వైఫల్యాలను గ్రౌండ్ లెవల్ లోనూ నిలదీస్తే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని కేడర్ భావిస్తోంది.