నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ల ఆటలు సాగనివ్వ : కేసీఆర్

-

తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మత పిచ్చిగాళ్ల ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వనని హెచ్చరించారు. మత పిచ్చికి లోనైతే బతుకులు ఆగమవుతాయని అన్నారు. స్వార్థ మత పిచ్చిగాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్​తో పాటు తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు.

కృష్ణా జలాల్లో వాటా తేల్చడం మోదీకి చేతకాదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘మోదీ.. మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం.’ అని సీఎం అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇవాళ ఏం లొల్లి జరుగుతోంది. కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే 9 రాష్ట్రాలను కూలగొట్టారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, దిల్లీ ప్రభుత్వాలను కూలగొడతారంటా. బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఇవాళ ఏం జరుగుతోంది. ఈ ఏడాది మన హైదరాబాద్​లోనే ఎక్కువ ఉద్యోగాలొచ్చాయి. కారణం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం. కేంద్ర ప్రభుత్వం ఒక్కటైనా మంచిపని చేసిండ్రా. ఒక్క ప్రాజెక్ట్ కట్టిండ్రా. ఏం చేసిండ్రా అని అడుగుతున్నా. కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి లేదా? దేశానికి కనీసం మంచినీళ్లు ఇవ్వలేరా? 70 టీఎంసీల నీళ్లు నదుల్లో పారుతూ ఉంటే మీకు సోయి లేదా?.– కేసీఆర్, సీఎం

Read more RELATED
Recommended to you

Latest news