తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లపై హైకమాండ్ ఆగ్రహం… సమావేశం రద్దు చేసుకోకుంటే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక

-

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి ముసలం మరింతగా ముదురుతోంది. పార్టీ అధిష్టానంపై కొంతమంది నేతలు అసంత్రుప్తిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ సీనియర్లలో అసంత్రుప్తి ఉంది. పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత తక్కడం లేదని వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. వీహెచ్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 

అయితే తాజాగా ఈ భేటీపై కాంగ్రెస్ సీనియర్లపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు సీనియర్లకు ఫోన్ చేసి… మీటింగ్ రద్దు చేసుకోవాలని.. ఒకవేళ మీటింగ్ పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇలా సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందులకు గురి చేయవద్దని.. ఏదైనా ఉంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించాలని కోరారు. ఇదిలా ఉంటే సీనియర్ నేతలు మాత్రం సమావేశం పెట్టేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాగే రెండు సార్లు పార్టీ సీనియర్ల సమావేశం అయ్యారు. పార్టీలోని అంతర్గత సమస్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి నివేధిక ఇవ్వాలనే లక్ష్యంతోనే సమావేశం ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news