ఒక్క రోజు కూడా ఆగలేరా సామీ మీరు ?? ఒకే ఒక్క రోజు ?

-

దేశవ్యాప్తంగా షట్ డౌన్ అమలులోకి ఉండటంతో అన్ని రంగాలు ఎక్కడికక్కడ మూత పడిపోయాయి. నిత్యావసర సరుకులకు మరియు కూరగాయలు మాత్రమే తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మందుబాబులు ఒక్క రోజు కూడా ఆగ లేక పోతున్నారు. మందు ఎక్కడ దొరుకుతుందా అని కూరగాయలు మరియు సరుకుల టైంలో బాగా ట్రై చేస్తున్నారు. కొంతమంది మందు బాటిల్ దొరకకపోవడంతో కొన్నిచోట్ల కళ్ళు తీసే చెట్ల దగ్గరికి వెళ్తున్నారంట. Telangana Government Announced The New Liquor Policy Notificationఅయితే ఉన్న కొద్దీ పరిస్థితి చాలా కఠినంగా మారటంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసుల పహారా కాయటంతో దొంగతనాలు చేయడానికి ఇటీవల రెడీ అవటం అందరికీ షాక్ కి గురిచేసింది. వైన్స్ దుకాణాలు గోడౌన్స్ వద్ద వెనక ఉండే ద్వారాలను లేకపోతే కిటికీలను పగలగొట్టి చాలా మంచి మందు బాబులు దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇటీవల వైన్స్ యజమానుల సంఘం పోలీసులను ఆశ్రయించింది. లాక్ డౌన్ నేపథ్యంలో మందు గోడౌన్ వద్ద కూడా బందోబస్తు పెట్టాలని డీలర్లు పోలీసులను కోరుతున్నారు.

 

ఈ ఘటనలు అన్నీ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఒకే ఒక్క రోజు ఇటీవల ఆదివారం నాడు ఇటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల జరగటంతో వైన్స్ యజమానుల సంఘం సభ్యులంతా కలిసి పోలీస్ కమిషనర్ కి పరిస్థితి వివరించారు. అంతేకాకుండా కొంత మంది కూరగాయలు మరియు నిత్యావసరాల సరుకులతో పాటు కనీసం రెండు గంటలు అయినా వైన్ షాప్ తెరవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో ఒక్క రోజు కూడా ఆగలేరా సామీ మీరు ? ఈ టైంలో మందు మానుకోటానికి ట్రై చేయొచ్చు కదా అంటూ కొంత మంది సలహాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news