తెలంగాణా రైతులకు కెసిఆర్ గుడ్ న్యూస్..!

-

తెలంగాణలో కెసిఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతు బంధు. రైతులకు ఆర్ధికంగా సహాయం అందించాలి అనే ఉద్దేశంతో కెసిఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. త్వరలోనే రబీ సీజన్ కోసం రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు.

తెలంగాణా రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం 12,862 కోట్లు కేటాయించగా ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది వ్యవసాయ శాఖ. తాజాగా రబీలో అందించేందుకు రూ.5,100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం.

ఈ మేరకు ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ పరిపాలనాశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. ఆ వెంటనే నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీనిపై తెలంగాణా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news