కలెక్టర్ కోర్ట్ కి రావాల్సిందే తెలంగాణా హైకోర్ట్ కీలక ఆదేశాలు

సంగారెడ్డి జిల్లా అధికారులపై తెలంగాణా హైకోర్ట్ ఫైర్ అయింది. తెలంగాణలోని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ను హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని రాష్ట్ర హైకోర్ట్ స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడి అందులో శిక్షపడితే మొక్కుబడి క్షమాపణలతో అప్పీలు దాఖలు చేస్తే అనుమతించే ప్రసక్తే లేదని హైకోర్ట్ వ్యాఖ్యలు చేసింది.

telanaga high court

కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్న సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీఓ ఎస్‌.శ్రీను, తహసీల్దార్‌ యు.ఉమాదేవి తీరును తప్పుబట్టిన న్యాయస్థానం.. కోర్టు ధిక్కరణ అప్పీలులో హాజరుకావాల్సి ఉండగా ఎందుకు రాలేదని నిలదీసింది. వచ్చే విచారణకు హాజరుకావాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

ఇక తెలంగాణా ప్రభుత్వ తీరుపై కూడా రాష్ట్ర హైకోర్ట్ మండిపడింది. అసలు కరోనా టెస్ట్ లు ఎందుకు చేయడం లేదని నిలదీసింది. కరోనా విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతీ విషయంలో నిబంధన విధించాల్సిందే అని స్పష్టం చేసింది. తెలంగాణాలో ఇక నుంచి పెళ్ళిళ్ళు, అంత్యక్రియలకు వంద మందిని మాత్రమే అనుమతించాలి అని తెలంగాణా హైకోర్ట్ స్పష్టం చేసింది.