ప్రస్తుత రాజకీయాలకు కొందరు కులం, మతం అంటూ రంగు పులుముతున్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేస్తూ కొందరు దేశాన్ని ఇంకా వెనక్కి నెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమైపోయాయని అన్నారు. అందుకే రాజకీయాల్లోనూ క్వాలిటీ సెల్ ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో జరిగిన క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 36వ సమావేశానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి అంశంలోనూ నాణ్యత అవసరమని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు ఆవిష్కరణలపై ఆసక్తి కల్పించాలని సూచించారు. భవిష్యత్‌పై ఆలోచనలు దీర్ఘకాలంగా ఉండాలని చెప్పారు. ఎవరూ కుంచిత మనస్తత్వంతో ఉండకూడదని అన్నారు.