‘రిజర్వ్’ రాజకీయం.. పైచేయి ఎవరిది?

-

తెలంగాణలో రాజకీయం హోరాహోరీగా సాగుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. మూడు పార్టీలు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే మెజారిటీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. ఇక ఈ సారి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్, ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పదునైన వ్యూహాలతో రెండు పార్టీలు ముందుకెళుతున్నాయి.

ఇదే సమయంలో తమకు బలం ఉన్న స్థానాల్లో విజయాలు సొంతం చేసుకోవాలని రెండు పార్టీలు చూస్తున్నాయి. అయితే తెలంగాణలో రిజర్వ్ సీట్లు కీలకంగా మారనున్నాయి. అవే గెలుపోటములని శాసించే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీ రిజర్వ్ 18, ఎస్టీ సీట్లు 12 ఉన్నాయి. మొత్తం 30 సీట్లు..119 సీట్లలో 30 సీట్లు రిజర్వ్ ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే వీటిల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి. గత రెండు ఎన్నికల్లో రిజర్వ్ సీట్లలో బి‌ఆర్‌ఎస్ పై చేయి సాధిస్తుంది. కానీ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది.

అయితే మొదట నుంచి రిజర్వ్ సీట్లలో కాంగ్రెస్ సత్తా చాటేది. కానీ అక్కడ ఉండే కొందరు నేతల తీరు వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. బి‌ఆర్‌ఎస్ పై చేయి సాధించింది. ఇక ఎస్టీ సీట్లలో మాత్రం కాంగ్రెస్ హవా ఉండేది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎస్టీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఆధిక్యం కాంగ్రెస్ పార్టీదే. గత ఎన్నికల్లో కూడా ఈ సీట్లలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.

అయితే ఇప్పుడు బి‌జే‌పి సైతం రిజర్వ్ సీట్లపై ఫోకస్ పెట్టింది..కాకపోతే ఆ సీట్లలో బి‌జే‌పికి పెద్ద పట్టు లేదు. దాదాపు ఒకటి, రెండు సీట్లు తప్ప మిగిలిన సీట్లలో బి‌జే‌పికి పట్టు లేదు. ఇక రిజర్వ్ సీట్లలో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుంది. మరి ఈ సారి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news