గోదావరి గెలుపు గుర్రాలు రెడీ..వైసీపీ విక్టరీ రిపీట్ అవుతుందా?

-

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ మళ్ళీ సత్తా చాటగలదా? టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే నిలువరించి గెలవగలదా? అంటే ఈ సారి కాస్త కష్టమనే చెప్పాలి. గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన వేరు వేరుగా పోటీ చేయడం, జగన్ గాలి వల్ల వెస్ట్ గోదావరి లో వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది.మొత్తం 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. అయితే వైసీపీ గెలిచిన 13 సీట్లలో దాదాపు 7-8 సీట్లు జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచిందని చెప్పవచ్చు.

ఇక ఈ సారి మాత్రం టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగా వెళుతున్నాయి. అటు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమలో వైసీపీ సత్తా చాటడం అంత ఈజీ కాదు. అయితే జగన్ కొందరు సిట్టింగులని మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏలూరులో ఆళ్ళ నాని, దెందులూరులో అబ్బయ్య చౌదరీ, నిడదవోలులో శ్రీనివాస్ నాయుడు, ఉంగుటూరులో పుప్పాల వాసుబాబు, కొవ్వూరులో తానేటి వనిత, గోపాలాపురంలో తలారి వెంకట రావు, నరసాపురంలో ముదునూరి ప్రసాద్ రాజు, తణుకులో కారుమూరి నాగేశ్వరావు, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ పోటీ చేయడం దాదాపు ఫిక్స్.

ఇక చింతలపూడి, భీమవరం, ఆచంట, పోలవరం సీట్లలో ఇంకా క్లారిటీ లేదు. అక్కడ సిట్టింగులకే ఛాన్స్ ఇస్తారా? లేదా చేంజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇటు టి‌డి‌పి సిట్టింగు సీటులైన పాలకొల్లు, ఉండి స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్ కాలేదు. అయితే ఇక్కడ టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి రిస్క్ తప్పదు. ఇక పొత్తు ఉన్నా సరే టి‌డి‌పి, జనసేనల మధ్య ఓట్ల బదలాయింపు సరిగ్గా జరగకపోతే వైసీపీకి మేలు జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news